బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ సంచలన నిర్ణయం తీసుకుంది..మత మార్పిడలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా యోగీ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.. ఈ ఆర్డినెన్స్ ప్రకారం బలవంతపు మత మార్సిడి.. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు..అయితే ఇటీవలె అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్డినెన్స్ అమలు ఎలా ఉండబోతోందనే దానిపై న్యాయ నిపుణుల్లో చర్చ జరుగుతోంది..
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో లవ్ జిహాద్‌పై జోరుగా చర్చ సాగుతుంది..యూపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆర్టినెన్స్‌ను తీసుకొచ్చింది..ఉత్తరప్రదేశ్‌లో చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్-2020 ప్రకారం..అబద్ధాలతో, బలవంతంతో జరిగే మత మార్పిడులను వివాహ ప్రయోజనం కోసం మాత్రమే జరిగే మత మార్పిడులను నేరంగా ప్రకటిస్తారు. ఈ తరహా కేసుల్లో బెయిల్ కూడా మంజూరు చేయరు. ఒకేవళ ఎవరైనా వివాహాం తర్వాత మతం మారాలని భావిస్తే..దాని గురించి రెండు నెలల ముందుగానే జిల్లా అధికారికి తెలపాల్సి ఉంటుంది..లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తీసుకోస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించిన యోగి..నెల రోజుల్లోపే ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేశారు..
గతంలో లవ్ మ్యారేజీలకు సంబంధించి ఇదే కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను కాదని నిన్న కొత్త తీర్పు ఇచ్చింది అలహాబాద్ హై కోర్టు. వివాహం కోసం మత మార్పిడి చేసుకోవడం ఆమోద యోగ్యం కాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ పంకజ్ నక్విలతో కూడిన బెంచ్ నిన్న కొట్టేసింది. గత సెప్టెంబర్‌లో ఒక తీర్పును, దాని ఆధారమైన 2014నాటి మరో తీర్పును కోర్టు చెల్లదని స్పష్టం చేసింది.