రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఒక కానిస్టేబుల్ కొడుకుగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి సొంతంగా కష్టపడి 150కి పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు సహాయము అందించాడు. పద్మ విభూషణ్ అవార్డు రావడంతో చిరంజీవికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే….మామ మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడంతో కోడలు ఉపాసన సినీ, రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించిన ఈ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరంజీవికి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం రామ్ చరణ్, ఉపాసనతో కలిసి ఫొటోకు పోజులిచ్చారు.