Upasana Konidela : గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు..

-

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను కొణిదెల ఉపాసన దక్కించుకున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోని సెలబ్రిటీలకు సంబంధించి ఈ వీసాను పొందిన తొలి మహిళగా ఉపాసన రికార్డుల్లోకి ఎక్కారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వీసా ఫోటోను షేర్ చేసి…తెలిపారు ఉపాసన.

“ఈ క్రిస్మస్ పండుగకు నాకు మంచి కానుక అందింది. యూఏఈ గోల్డెన్ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్ని దేశాల పట్ల నాకు గౌరవం ఉంది. నేనెప్పుడూ గ్లోబల్ సిటిజన్. ప్రపంచమంతా ఒకే కుటుంబం” అంటూ మెగా కోడలు ఉపాసన ట్వీట్ చేసింది. ఈ ఏడాది గోల్డెన్ వీసా అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ , తమిళ నటి త్రిష తదితరులు ఉన్నారు. ఇక తాజాగా ఈ జాబితా లో కొణిదెల ఉపాసన చేరి పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version