కార్తీకదీపం ఎపిసోడ్ 1234: మోనితను ఇంట్లోంచి గెంటేసిన సౌందర్య..నామకరణంలో బిడ్డను తీసుకుని రచ్చరచ్చ చేసిన రుద్రాణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కోటేష్-శ్రీవల్లి బాబు నామకారణం గురించి చెప్తారు. కార్తీక్, దీప ఇది మన ఇంట్లో ఫంక్షన్ ..అందరిని పిలిచి ఉన్నంతలో బాగా చేద్దాం అంటారు..అక్కా మనం పిలిచినా ఈ ఫంక్షన్ కి చుట్టుపక్కల ఎవ్వరూ రారు కదా అంటుంది. రుద్రాణితో గొడవ పడ్డాక మన ఇంటికి ఎవ్వరూ రారు అని శ్రీవల్లి…రుద్రాణిని ఎదిరిస్తే ఊరంతా ఎదురుతిరిగేలా చేస్తుందని బాధపడతాడు కోటేష్.. ఎవరూ రాకపోయినా మేం ఉన్నాం కదా అంటారు దీప-కార్తీక్. కిరాణా కొట్లో..మీరు కొన్ని డబ్బులు ఇచ్చారని తెలిసింది..ఇదిగోండి అని డబ్బులు ఇవ్వబోతాడు..దీప వాళ్లు వద్దంటారు. కార్తీక్..కోటేష్ కి కూడా మన ఆదిత్యకు లాగే కొన్ని లక్షణాలు ఉన్నాయికదా అంటాడు. కోటేష్ ఏంటి సార్ ఏదో అంటున్నారు అంటే..ఏం లేదు అని కార్తీక్ వెళ్లిపోతాడు. ఇన్ని కష్టాల్లో ఉన్నా ఇలా ఆలోచిస్తున్నారంటే వీళ్లు గొప్పోళ్లు.. దేవుడా వీళ్లని చల్లగా చూడు అనుకుంటాడు కోటేష్…

సౌందర్య ఇంట్లో మోనిత

మోనిత ఇంట్లో నరసమ్మ ఇచ్చిన జ్యూస్ తాగుతుంటుంది. బాగా అలిసిపోయాను నర్సమ్మ అంటుంది మోనిత. ‘అమ్మా అయ్యగారు కనిపించడం లేదేంటమ్మా..’అంటుంది. సినిమా మొత్తం చూసి హీరో-హీరోయిన్ కి ఏమవుతుందని అడిగినట్టుంది అంటుంది మోనిత. నా కార్తీక్ బాబు కనిపించడం లేదు, నా కొడుకును ఎవరో ఎత్తుకెళ్లారు వాడిని వెతుక్కోవాలి, మొగుడూ లేడు-కొడుకు లేడు ఉన్నదల్లా గుండెనిండా ప్రేమ మాత్రమే అంటుంది మోనిత. ఇలా వీళ్లిద్దరూ సోదంతా మాట్లాడుకుని..సీన్ ల్యాగ్ చేస్తారు.

ఆ ఇంట్లో సౌందర్య గారు పెళ్లైన వాడిని ప్రేమించావ్ అన్నారని నరసమ్మ అనగానే…. చేతిలో గ్లాస్ విసిరేసి నరసమ్మకి క్లాస్ పీకుతుంది మోనిత. ‘చెప్పింది అర్థం కాలేదా.. అయిన నేను పెళ్లి అయిన వాడ్ని ప్రేమించలేదు, 18 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను, కార్తీక్ నన్ను పెళ్లిచేసుకోలేదు. కార్తీక్కే నన్ను పెళ్లి చేసుకోలేదు.. కొడుకు లేడు. ప్రేమించినవాడూ లేడు.. ప్రేమ మాత్రమే ఉంది’ అంటుంది అరుస్తూ.. ‘అది చాలమ్మా ప్రేమ చాలు.. వాటన్నింటిని అదే లాక్కొస్తుంది’అంటుంది. ఇదివరకు ప్రియమణి అని ఓ జాతిరత్నం నా దగ్గర పని చేసేది.. అది ఎందుకు పని మానేసిందో తెలుసా? నీలానే అడ్డమైన ప్రశ్నలు వేసేది..వద్దన్నా వినలేదు..తన పనైపోయింది..వాళ్లూరు తాడికొండ వెళ్లిపోయింది. నీ ఉద్యోగం కొండెక్కకుండా ఉండాలంటే ప్రశ్నలు వేయడం మానేయాలని చెబుతుంది.

బాబుకి నామకరణం చేస్తున్నారని తెలుసుకున్న రుద్రాణి..ఏదో ఒక పేరు పెట్టాలికదా అందుకే నామకరణం చేస్తున్నారు.. చేసుకోనీ అంటుంది. నువ్వేమీ పట్టించుకోవా అంటాడు పనోడు..నీకు తెలుసు కదా చిన్నపిల్లలంటే నాకెంత ఇష్టమో.. పిల్లలు దేవుడితో సమానం కదా కానీ దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు..కుదిరితే నా తరపున కానుక పంపిద్దాం అంటుంది రుద్రాణి. ఈమె బిల్డప్ ఏంటో…ఈ కథేంటో తెగ ఓవర్ చేస్తుంది.

సౌందర్య ఇంటికి వచ్చిన రత్నసీత ఓ శుభవార్తతో వచ్చానంటుంది. మీరు చెప్పినట్టే మోనితని నేను ఫాలో అయ్యానని చెప్పిన రత్నసీత.. బాబు మిస్సైన ఏరియాలో ఎంక్వైరీ చేశానంటూ సీసీ టీవీ ఫుటేజ్ వీడియో చూపిస్తుంది.

తెల్లారి.. బాబు నామకరణం ఏర్పాట్లు జరుగుతుంటాయి. బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. శౌర్య కిందపడుతుంది. అందరూ బయటకు వస్తారు. రాయి గుచ్చుకుంది అంటుంది శౌర్య. చెప్పులేసుకుని ఆడుకోవాలి అని కార్తీక్ అంటే.. చెప్పులు తెగిపోయాయి నాన్న అంటుంది శౌర్య. ఆ మాటలు విని కార్తీక్ బాధపడతాడు. కార్తీక్.. మనసులో దేవుడా..పిల్లలకు చెప్పులు కూడా కొనివ్వలేని పరిస్థితిలలో ఉన్నానా అనుకుంటాడు. పాపని అత్తమ్మ అంటోంది..సార్ ఏమో రౌడీ అంటున్నారని శ్రీవల్లి-కోటేష్ మాట్లాడుకుంటారు. చిన్న రాయికే భయపడుతున్నావా అన్న దీప..చెప్పులు కొనిస్తానులే అంటే..హిమ నా చెప్పులు కూడా తెగేలా ఉన్నాయంటుంది. సరే నీకు కూడా కొనిస్తాలే అంటుంది. సరే నేను డాడీ షాపింగ్ చేస్తాం అంటే..ప్రస్తుతం మనం చెప్పులు కొనుక్కోవాలి..షాపింగ్ అన్నపదం వాడకూడదు అంటుంది.

మోనితకి క్లాస్ ఇచ్చిన సౌందర్య

ఏంటి మోనిత మాట్లాడవేంటి, నీ బిడ్డని మేం దొంగిలించామా…నీపై పగసాధించడానికి నా కొడుకు నీ బిడ్డని ఎత్తుకెళ్లాడా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, మాతృత్వం అంటేనే.. అందమైన బాధ్యత, కానీ దాన్ని నీ స్వార్థానికి వాడుకున్నావ్ మోనిత, పుట్టిన బిడ్డని సైతం అడ్డం పెట్టుకుని మమ్మల్ని సాధించాలని చూస్తున్నావ్, నీ మెళ్లో నువ్వే తాళి కట్టుకున్నావ్, నీ అంతట నువ్వే కార్తీక్ ని భర్తగా ఊహించుకుంటున్నావ్..అనోకోగానే అన్నీ అయిపోవు..ఏదో ఒకటి రెండు నీ కపట నాటకాలతో నిజం కావొచ్చు.. అబద్ధాలతో అన్నిసార్లూ గెలవలేవు మోనిత అని సౌందర్య పెద్ద క్లాస్ వేస్తుంది.

నిల్చోబెట్టి మాట్లాడుతున్నావేంటి బయటకు గెంటేయ్ అంటాడు ఆదిత్య. మోనిత రియాక్టయ్యేలోగా సౌందర్య..నీ కొడుకుని ఎవరో ఎత్తుకెళ్లారన్నావ్ కదా.. నా కొడుకు అని అరవటం కాదు మోనిత.. పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాలి… రోడ్డు పక్కన కార్లో వదిలేసి వెళితే బాధ్యత అనిపించుకుంటుందా అంటూ నువ్వు చేసిన నిర్వాకం ఏంటో.. నీకే తెలుస్తుందని వీడియో చూపిస్తుంది సౌందర్య. ఎవరో తీసుకువెళ్తే..మమ్మల్ని బ్లేమ్ చేస్తూ..ఈ ఇంటికి వచ్చి రచ్చ చేస్తున్నావ్ నువ్వు అంటుంది. వీడియో చూసిన మోనిత..దెబ్బకి షాక్ అవుతుంది. నోట మాట రాదు. ఇప్పుడు మాట్లాడవేంటి, నువ్వొచ్చిన మొదటి రోజే నిన్ను ఇంట్లోంచి గెంటేసేదాన్ని.. కానీ నీ వంకర బుద్ధి నాకు తెలుసుకదా..వీధిలోకి వెళ్లి రచ్చ చేస్తావ్..సానుభూతి కోసం ట్రై చేస్తావ్.. నిజానిజాలేంటో నిరూపించాకే నిన్ను బయటకు గెంటేద్దాం అని ఆగాను..నువ్వే వెళతావా..గెంటేయమంటావా.. అని ఆదిత్యకు చెప్తుంది. మనోడు వెళ్లి బ్యాక్ తీసుకొచ్చి మోనిత కాళ్ల కిందపడేస్తాడు. వెళ్లు వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపో..ఇది సౌందర్య ఇళ్లు అని గుర్తుపెట్టుకో మోనిత.. ఇంకోసారి ఈ గడప తొక్కాలని ప్రయత్నించకు అని మోనితకు ఇచ్చిపడేస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో

బాబుకి నామకరణం జరుగుతుంది. ఇంతకీ బాబు పేరు ఏం పెట్టాలని నిర్ణయించారని పంతులు అడిగితే.. రంగరాజు అంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. మీరు ఎక్కువ చేస్తున్నారు బిడ్డని ఇచ్చేయండి అంటుంది దీప. అడుగు ముందుకేస్తే నువ్వు-మీ ఆయన-నీ పిల్లలు అన్యాయమైపోతారంటుంది రుద్రాణి. రేపటి ఎపిసోడ్ లో రచ్చరంబోలానే జరుగుతుంది.అక్కడ మోనతి బ్యాక్ తీసుకుని బయటకువస్తుందో లేక ఇంకేమైనా చేస్తుందో..ఇక్కడ ఈ లేడీ విలన్ బిడ్డను తీసుకుంది..దీప ఏం చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version