మస్తాన్ కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్..!

-

మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. మస్తాన్ సాయి, అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేసిన మస్తాన్ సాయిపై NDPS సెక్షన్ ను కూడా జోడించారు పోలీసులు. మస్తాన్ సాయి, లావణ్య మధ్య గతంలోనే సయోధ్య కుదిర్చాడు రాజ్ తరుణ్. మస్తాన్ సాయి లాప్ టాప్ లో ఉన్న లావణ్య వీడియోలను గతంలోనే డిలీట్ చేపించాడు రాజ్ తరుణ్. కానీ డిలీట్ చేయకముందే ఇతర డివైజేస్ లోకి వీడియోస్ కాపీ చేసుకున్న మస్తాన్ సాయి.. లావణ్యను పలు మార్లు చంపేందుకు ప్రయత్నించాడు.

హార్డ్ డిస్క్ కోసం లావణ్య ను చంపాలని ప్లాన్ చేసిన మస్తాన్ సాయి.. జనవరి 30న లావణ్య ఇంటికి వెళ్లి లావణ్యపై హత్య యత్నం చేసాడు. అక్టోబర్ 2022లో తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి.. లావణ్య డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా సీక్రెట్ సీసీ కెమెరాలో విడియిస్ రికార్డు చేసాడు. నవంబర్ లో మరో పార్టీలో లావణ్య కు డ్రగ్స్, మద్యం తాగించిన మస్తాన్.. మత్తులో ఉన్న లావణ్య ప్రైవేట్ విడియస్ తీసాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో లావణ్య, మస్తాన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఇక పోలీస్ లకు విషయం చెబితే , వీడియోను సోషల్ మీడియాలో పెడుతా అని మస్తాన్ సాయి బెదిరింపులకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version