మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్ నేతలతో పాటు శరద్ పవార్‌కు ఊహించిన షాక్ ఇచ్చిన అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ కు బలనిరూపణకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు గవర్నర్ కోష్యారీ తెలిపారు.
నవంబరు 30లోపు బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. కాగా, మహారాష్ట్ర పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరై మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తారు.