Breaking : టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులు

-

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు సిద్ధమవుతోంది. సేవా టిక్కెట్లు, ప్రసాదాలు, అగరవత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్ కొనుగోళ్లు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులకు ఆదేశించారు.

ఆయన మాట్లాడుతూ టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ, యాత్రికులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్‌, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

స్థానికాలయాల్లో కల్యాణోత్సవంతోపాటు ఇతర ఆర్జితసేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలన్నారు. ఆలయాల్లో పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా భక్తులకు మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డీఎఫ్‌వోను ఆదేశించారు. అన్ని ఆలయాల్లో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version