ఉప్పెన సృష్టించడానికి రెడీ అవుతున్నారు..

సంక్రాంతి వచ్చేస్తుంది. అందుకే ఒక్కొక్క సినిమా, పనులన్నింటినీ ముగించుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల్లో కొన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ సిద్ధం అయ్యాయి. అలాగే పండగ తర్వాత కూడా రిలీజయ్యే సినిమాలు చాలా ఉన్నాయి. ఐతే అన్ని సినిమాల విడుదల తేదీలు దాదాపు వచ్చినప్పటికీ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం నుండి ఊసు కూడా వినపడలేదు.

తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు చెప్పడానికి టీజర్ విడుదల తేదీని ప్రకటించారు. బుధవారం సాయంత్రం 4గంటల 5నిమిషాలకి ఉప్పెన టీజర్ రిలీజ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది. క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా చేస్తున్నాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు.