బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేల, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరి చాటుమాటు వ్యవహారాలు ఫోటోలతో సహా బయటకు వచ్చాయి. బహిరంగంగా దొరికిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలు, పబ్ లంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మీడియా సహా బీసీసీఐలోనూ దీనిపై అప్పట్లో హాట్ టాపిక్. కానీ ఆ బంధం ఎన్నాళ్లో నిలబడలేదు. ఇద్దరి మధ్య మనస్పర్దలొచ్చి దూరమయ్యారు. అప్పటి నుంచి మ్యాటర్ కామ్ అప్ అయిపోయింది. అయితే తాజాగా ఓ మీడియా సంస్థ ఊర్వశినీ పాండ్య మాజీ ప్రేమసి అంటూ బాలీవుడ్ మీడియా హైలైట్ చేసింది.
ఊర్వశి తన వ్యక్తి గత సమస్య నేపథ్యంలో పాండ్య సహాకారం కోరిందని ఆ కథనం ముఖ్య సారాశం. ఈ విషయం అమ్మడిని చెవిన పడటంతో మీడియాపై అగ్గిమీద గుగ్గిలం అయింది. ఆ కథనాలు రాసిందో ఎవరో తెలిస్తే గుడ్డలూడదీసి తన్నా అన్న రేంజ్ లో వ్యాఖ్యానించింది. ఇలాంటి పిచ్చి రాతలు రాస్తే రాసే వాళ్లకు పుట్టగతులుండవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కథనాలు వల్ల ఇంట్లో తగాదాలు ఏర్పడుతాయని వాపోయింది. తన కుటుంలో జరగరానిది ఏదైనా జరిగితే దానికి మీడియా బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించింది. ఇలాంటి కథనాలు కట్టిపెట్టకపోతే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. మరి బాలీవుడ్ మీడియా వీటికి ఎలాంటి బధులిస్తుందో చూడాలి.
సాధారణంగా మీడియాలో రూమర్లు సహజం. అదీ సెలబ్రిటీల గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. చాలా మంది సెలబ్రిటీలు వీటిని లైట్ తీసుకుంటారు. బిగ్ బీ కోడలు ఐశ్వర్యారాయ్ పై పెళ్లి అయిన తర్వాత కూడా వంద రకాల రూమర్లు వచ్చాయి. కానీ ఏ రోజు మీడియాను దూషించింది. లేదు. కానీ ఊర్వశి రేతేల మాత్రం మీడియాని చెడుగుడు ఆడేసింది సుమీ.