అమెరికాలో ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా.. తెలుగు మహిళ..!!!

-

భారతీయులు ఎంతో మంది వివిధ దేశాలలో రకరకాల వృత్తులలో స్థిరపడ్డారు. మరెంతో మంది ఆర్ధికంగా ఉన్నతమైన స్థానాలకి చేరుకున్నారు. విద్యా, వైద్యం, సాంకేతిక రంగం, రాజకీయం ఇలా ప్రతీ రంగంలో భారతీయులదే పైచేయిగా నిలుస్తూ వచ్చారు. స్థానిక దేశస్తుల కంటే కూడా భారతీయులు తమదైన ప్రతిభతో దూసుకు పోతున్నారు. ఇప్పటికి భారతీయుల హవా విదేశాలలో కొనసాగుతూనే ఉంది. అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా భారతీయులు ఉన్నతమైన స్థానాలలో నియమింప బడుతున్నారంటే అది భారతీయుల గొప్పదనమనే చెప్పాలి. తాజాగా ట్రంప్..

భారత సంతతికి చెందిన తెలుగు మహిళ కోమటిరెడ్డి సరిత కి అగ్ర రాజ్యంలో కీలక పదవి కట్టబెట్టాడు. ఈ ఎంపిక ఇప్పుడు ప్రపంచ వ్యాపతంగా చర్చనీయాంశం అవుతోంది…అమెరికాలో అత్యున్నతమైన న్యాయస్థాన వ్యవస్థ అయిన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ న్యాయమూర్తిగా ఆమె ట్రంప్ చే నామినేట్ చేయబడ్డారు. అంతేకాదు ఈ కోర్టు అత్యంత ప్రభావవంతమైన ఫెడరల్ కోర్టు కావడంతో ఈ కోర్టు పరిధిలో కొన్ని రాష్ట్రాలు సైతం ఉంటాయని తెలుస్తోంది.

ఇలాంటి కోర్టుకి ఓ భారతీయురాలిని, అందులోనూ  తెలుగు మహిళని నియమించడం పట్ల ఎంతో మంది భారతీయులు, తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరిత గతంలో బీపీ డీప్ వాటర్ హరిహన్, ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షార్ ద్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరుపున న్యాయవాదిగా కూడా పని చేశారు. ప్రస్తుతం సరిత అమెరికా అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ డిప్యుటీ చీఫ్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version