తూర్పు ఉక్రెయిన్ పై బాంబుల మోత ఆరంభం అయిందని, ఇందుకు రష్యా తన వంతు బాధ్యత మొదలుపెట్టిందని, దీంతగో ఇరువర్గాల మధ్య కవ్వింపు చర్యలు ఆరంభం అయ్యాయని వార్తలు అందుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీప్ లో కూడా దాడులు మొదలయ్యాయి అన్న వార్తలు ధ్రువీకరణలోఉన్నాయి. యుద్ధం తీవ్రతరం అయ్యే కొద్దీ రష్యా ఇంకొంత చెడ్డ పేరును పెంచుకోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు.తాజా పరిణామాలు అన్నవి భవిష్యత్ లో ఐరోపా భద్రతను నిర్ణయిస్తాయి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్ స్కీ అంటున్నారు.
ఆయన మాటలు నిజం చేసేలా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే డైలమాలోకి నెట్టేలా ఇప్పుడున్న యుద్ధ పరిణామాలు దోహదం కానుండడం శోచనీయం మరియు విచారకరం. తాజా పరిణామాలకు పూర్తి బాధ్యత రష్యానే వహించాలి అని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ అంటున్నారు.గురువారం ఉదయం జీ 7 దేశాలతో భేటీ అయ్యాక తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అంటున్నారీయన. అదేవిధంగా నాటో కూటిమి తరఫున బలమయిన ప్రతిస్పందన ఉంటుందని కూడా చెప్పారీయన.మరోవైపు నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ మొదట నుంచి ప్రయత్నిస్తోంది.దీనిని రష్యా జీర్ణించుకోలేకపో తోంది.ఈ పరిణామం కూడా యుద్ధానికి ఓ కారణం.