రోజూ దీపం పెడుతున్నారా..? అంతా మంచి జరగాలంటే ఈ నూనెతో పెట్టండి..!

-

రోజు మన నిత్య పూజ లో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. అయితే దీపం పెట్టేటప్పుడు ఏ నూనెతో దీపం పెడితే మంచిది అన్న విషయం పండితులు చెప్పారు. అయితే దీపం పెట్టేటప్పుడు భక్తి భావనతో దీపాలు వెలిగిస్తూ ఉంటాము. నెమ్మదిగా మనలోని అజ్ఞానం హరించుకుపోతుంది. ఇక దీపారాధనకు ఏ నూనె వాడితే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అయితే మనం వాడే నూనెను బట్టి కూడా ఫలితం ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు.

దీపారాధనకు ఆవు నెయ్యి ని ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు తొలగి పోవాలంటే ఆవు నెయ్యి తో దీపం పెట్టండి. అలాగే అనారోగ్యంతో, పేదరికం ఉండకుండా ఉండాలంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆముదం, వేప నూనె, విప్ప నూనె, ఆవు నెయ్యి కలగలిపి తయారు చేసుకుని పెట్టాలి.

అలానే ఇంట్లో చెడు ప్రభావాలు తగ్గిపోవాలంటే పంచ దీపం నూనెతో దీపారాధన చేయండి. దీంతో చెడు ఆలోచనలు ఉండవు. ఆముదం తో దీపం పెడితే కీర్తి ప్రతిష్టలు పొందచ్చు. నువ్వుల నూనెతో దీపం పెడితే మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు తగ్గిపోతాయి. శని గ్రహ శాంతి కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా నువ్వుల నూనె తో దీపం పెడితే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version