తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి : ఉత్తమ్

-

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… కూడా ప్రతి సారి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతూనే ఉన్నారు. కెసిఆర్ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. అయితే ముందస్తు ఎన్నికలపై తాజాగా…మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆయన కూడా అన్నారు. కర్ణాటక తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ వదిలేసి… నియోజక వర్గాలకు వెళ్ళండని పిలుపునిచ్చారు ఉత్తమ్. తాను ఎక్కడ పోటీ చేయాలి అనేది సోనియా గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి కష్ట పడితేనే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రకటన చేశారు. కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version