మోదీ, కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారు. – ఉత్తమ్ కుమార్ రెడ్డి.

-

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ నేత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్ వేదికగా జరుగుతున్న వరి దీక్షలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలను నిలదీశారు. రైతుల నష్టపోవడానికి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే కారణం అంటూ విమర్శించారు. ఆయన నిర్లక్ష్యం వల్లే కొనుగోలు ఆలస్యమవుతుందని ఆరోపించారు. ఫలితంగా రైతుల ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయన్నారు. మోదీ, కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టినా.. ఇప్పటి వరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని అన్నారు.

పంజాబ్​లో ఇప్పటికే కోటి 10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మన కంటే చిన్న రాష్ట్రాలు కూడా 40 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తున్నాయి. ఛత్తీస్​ఘడ్​లో వరికి క్వింటాల్​కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. మరి ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వట్లేదు. రైతు రుణమాఫీ, పంట బీమా విషయాల్లోనూ.. అన్నదాతలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. పార్లమెంట్ లో రైతుల సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version