పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఓ బ్రోకర్‌: ఉత్తమ్‌

-

పెద్దల సభకు అడుగుపెట్టే అర్హత పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి లేదని ఆయన ఓ పెద్ద బ్రోకర్‌ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు సంధించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వచ్చిన ఆయన ఖమ్మం– నల్గొండ– వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రామును నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.రాములు నాయక్‌తో పాటు రంగారెడ్డి–హైదరాబాద్‌– మమబూబ్‌నగర్‌ స్థానానికి బరిలో దిగిన చిన్నారెడ్డికి ఎఫ్‌టీఎఫ్,టీటీఎఫ్‌ మద్దతు తెలిపినట్లు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

అందుకే రాములు నాయక్‌ రాజీనామా..

జనరల్‌ సీటులో భాగంగా గిరిజన నాయకుడైన రాములు నాయక్‌కు సీటిచ్చాం. కేసీఆర్‌ దోపిడీ విధానం, ఎస్టీ, ఎస్సీ సభ్యుల పట్ల వివక్ష చూపుతూ తమ వారిని అవమానించారనే కారణంతో రాములు నాయక్‌ టీఆర్‌ఎస్‌ పోలిట్‌ బ్యూరోకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పెద్ద బ్రోకర్‌ ఆరేళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేరు. మల్లారెడ్డి, పల్లా, ప్రైవేటు యూనివర్సిటీలు తెచ్చుకొని లాభపడ్డారని ఉత్తమ్‌ ఆరోపించారు. కోదండ రామ్‌కు ఓటేస్తే వృథాగా అవుతుందని పల్లా ప్రలోభాలను ఓటర్లు తిప్పికొడతారని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్‌ ఇంటికే ఉద్యోగాలు..

ఈ ఏడేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంట్లోకే ఉద్యోగాలు వచ్చాయని ఉత్తమ్‌ ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో టీఆర్‌ఎస్‌ అబద్దాలు ఆడుతున్నారని.. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారన్నారు. కొత్త బిచ్చగాళ్లకు పొద్దు ఎరగదన్నట్లు బండి సంజయ్‌ తీరు ఉందని కాంగ్రెస్‌ నాయకులను డబ్బుల సంచులతో కొనుగోళ్లు చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, పదోన్నతుల పేర్లతో ఆశచూపి చివరకు మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ మనుషులనే కాకుండా ఏకంగా దేవుడినే మోసం చేశారని భద్రాదికి రూ. 100 కోట్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బీజేపీకి తగిన గుణపాఠం తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version