మంచు ప్రళయం వెనుక కారణలేంటి..నందాదేవి పర్వతం మిస్టరీ ఇదేనా

-

ఉత్తరాఖండ్‌ జల విలయానికి కారణమేంటి. నందాదేవి శిఖరాగ్రం ఎలా విరిగిపడింది..ఈ మంచు బీభత్సం తర్వాతఎన్నో అనుమానాలు.. మరెన్నో ఉహాగానాలు ఇప్పుడు తెరమీదికి వస్తున్నాయి. ప్రధానంగా.. ఆపరేషన్‌ బ్లూ మౌంటేన్‌ తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాల కింద మిస్సైన అణు పరికరమే తాజా విలయానికి దారి తీసిందా..చైనాకు చెక్ పెట్టేందుకు సీఐఏ, ఐబీ కలిసి తయారు చేసిన అణుపరికరమే దీనంతటికీ కారణమా అన్న ఆసక్తి రేపుతుంది.

ఉత్తరాఖండ్‌ జలవిలయం తర్వాత జనాల్లో ఇప్పుడిలాంటి అనుమానాలే రేకెత్తుతున్నాయ్‌. అసలేం జరిగి ఉంటుందనే చర్చ విపరీతంగా జరుగుతోంది. అందులో భాగంగానే.. దశాబ్దాల క్రితం అమెరికా, ఇండియా కలిసి చేసిన ఒక ఆపరేషన్‌పై అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. దీంతో.. ఒకప్పటి ఆపరేషన్‌ హ్యాట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా నిలిచింది.

ఇది ఈనాటి కథ కాదు. ఐదు దశాబ్దాల క్రితం అంటే 1964లో చైనా తొలిసారి అణుపరీక్షలు జరిపింది. ఆ పరీక్షలు..అమెరికాలో అనుమానాన్ని, అసహనాన్ని పెంచాయి. దీంతో, చైనా అణుపాటవం మీద ఫోకస్ పెట్టాలనుకున్న అగ్రరాజ్యం దానికి భారత్‌ సాయం కోరింది. అందులో భాగంగానే 1965లో అమెరికా సీఐఏ తో కలిసి ఆపరేషన్‌ హ్యాట్‌కు భారత్ ఐబీ ఓకే చెప్పింది. చైనామీద కన్నేసి ఉంచేందుకు అనువైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ఆపరేషన్‌ హ్యాట్‌ ముఖ్య ఉద్దేశం. అది జరగాలంటే చైనాకు సమీపంలో ఉండి ఉన్నచోట నుంచి చైనా పరిసరాలను గమనించగల స్థావరం కోసం వెతకాలి. దానికోసం ఎంచుకున్న స్థలమే నందాదేవి పర్వతం.

 

నందాదేవి పర్వతం వద్ద సెన్సార్స్‌ ఏర్పాటు చేస్తే.. చైనా గుట్టు కాస్తయినా తెలుస్తుందని నాటి కెప్టెన్‌ మన్మోహన్‌ కోహ్లీ నేతృత్వంలో.. సీఐఏ, ఐబీ బృందం నందాదేవి పర్వతంపైకి … ప్రక్రియకు అవసరమైన ఎక్విప్‌మెంట్ తీసుకెళ్లింది. అందులో అణు ఇంధనంతో నడిచే జనరేటర్‌, ఫ్లూటోనియం క్యాప్సూల్, ఏంటెనాలు ఉన్నాయి. అయితే, ఆ బృందం వెళ్లి ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసే సమయానికి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు ఉంటే ప్రాణాలే పోయేవి. దీంతో భయపడి అందరూ వెనక్కి వచ్చేశారు. వాతావరణం అనుకూలించాక మళ్లీ పని మొదలుపెట్టాలనుకున్నారు. కానీ, మళ్లీ వెళ్లి చూస్తే.. అక్కడ అణుధార్మిక పదార్థమైన ఫ్లూటోనియం క్యాప్సూల్‌ లేదు.

 

 

నందాదేవిలో అదృశ్యమైన ఫ్లూటోనియం భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ క్యాప్సిల్ లైఫ్ టైమ్ వందేళ్లు. ప్రస్తుతం 55ఏళ్లు పూర్తయ్యింది. అంటే ఇంకా 45 ఏళ్లు మిగిలే ఉంది. కాబట్టి, ఆ అణుపదార్థం వల్లే.. ఈ ఉపద్రవం సంభవించి ఉండొచ్చన్న అనుమానాలూ లేకపోలేదు. ఆపరేషన్‌ హ్యాట్‌ కారణంగానే.. ఈ మంచు బీభత్సం అనే సందేహాలు ఉద్భవిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version