కాంగ్రెస్ లేకుంటే థర్డ్ ఫ్రంట్ లేదు.. రేపోమాపో మమతా కూడా కాంగ్రెస్ వెంటే- వీహెచ్

-

దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలు బలపడితేనే థర్డ్ ఫ్రంట్ సాధ్యం అని ఆయన అన్నారు. బలమైన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే థర్డ్ ఫ్రంట్ సాధ్యం అని అన్నారు. నేడో రేపో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్తోనే వస్తుందని ఆయన అన్నారు. సంజయ్ రౌత్ కరెక్ట్ సమాధానం చెప్పారని.. కాంగ్రెస్ లేకుంటే థర్డ్ ఫ్రంట్ లేదని ఆయన అన్నారని వీహెచ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఉండదని ఆయన అన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని కాదని.. ఇతర పార్టీలు అన్నీ కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేయలేరని వీహెచ్ అన్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త కూటమిని కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ, శివసేన, ఎన్సీపీ పార్టీలను కలువగా.. ఇటీవల కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్ ని కలిశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా.. కొత్త కూటమి సాధ్యం కాదనే విషయాన్ని శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version