వాస్తు: ముఖ ద్వారానికి సంబంధించి ఈ తప్పులు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ముఖ ద్వారానికి సంబంధించి కొన్ని విషయాలని చెప్పారు. మరి వాటి కోసం చూద్దాం.

ముఖద్వారం అన్ని గదుల కంటే పెద్దగా ఉండాలి. అలానే ఇంటి ముందు ఎప్పుడూ కూడా నీళ్లు పారుతూ ఉండకూడదు. ఒకవేళ కనుక ఇలా ఉంటే ఆర్ధిక ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ కనుక ఇంటికి ఎదురకుండా రోడ్డు కానీ ఆలయం కానీ ఉంటే కొంచెం స్పేస్ వదిలేయడం మంచిది. ఒకవేళ కనుక ఇంటికి ఎదురకుండా స్తంభం ఉంటే ఇంట్లో ఉండే మహిళలకు అనారోగ్య సమస్యలు కలగొచ్చు.

ఒకవేళ కనుక ఇంటి ఎదురుకుండా పెద్ద చెట్టు ఉంటే దాని వలన చిన్న పిల్లలకి సమస్యలు కలుపుతాయి. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా చెక్కతో తయారు చేసింది అయి ఉండాలి. అప్పుడే ఆనందం ప్రశాంతత ఉంటాయి. ప్రశాంతంగా ఉండడానికి కూడా అవుతుంది.

ఇంటి ముఖ ద్వారం తలుపు ఎప్పుడూ కూడా మంచి చెక్కతో తయారు చేసినది అయ్యి ఉండాలి చూశారు కదా సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలని అనుసరించాలి అనేది. మరి ఈ తప్పులు చేయకుండా ఆనందంగా ఉండండి లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version