పిల్లలకు ఫ్లూ టీకాతో.. కొవిడ్‌ మూడో వేవ్‌కు చెక్‌ !

-

కరోనా విజృంభణ ఇప్పుడు తల్లిదండ్రుల్లో కూడా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే గతంలో కొవిడ్‌ వ్యాప్తి చెందినపుడు పిల్లలపై దీని ప్రభావం ఉండదు అనుకున్నారు. అయితే, ఈ ఏడాది కొవిడ్‌ కేసుల్లో పిల్లల సంఖ్య కూడా పెరిగింది. పిల్లల్లో రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి, వారు పూర్తిగా కోలుకుంటారన్న హామీ కూడా ఇవ్వలేం. ఈ విషయాన్ని ఫోర్టీస్‌ ఆస్పత్రి సీనియర్‌ పియాట్రిషన్‌ డాక్టర్‌ జేసల్‌ సేత్‌ ఇండియా డాట్‌ కమ్‌లో వెల్లడించారు. మొదటి దశ కరోనా వ్యాపించినపుడు కేవలం 60 ఏళ్లు పైబడిన వారికి ప్రమాదకరంగా మారింది. సెకండ్‌ వేవ్‌లో దాదాపు అన్ని వయస్సు వారికీ సోకింది. అదేవిధంగా మూడో దశలో పిల్లలను రిస్క్‌లో పడేసే పరిస్థితి కూడా రావచ్చని డాక్టర్‌ తెలిపారు. అయితే, ముందుగానే దీన్ని గుర్తించి పిల్లల్లో వైరస్‌ ప్రమాదకరంగా కాకముందే సరైన చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిషన్‌ (ఐఏపీ) ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలకు ప్రతి ఏడాది ఫ్లూ సంబంధిత టీకాలను ఇవ్వడం మంచిదని సూచించింది. ఇటీవల అమెరికా మిచిగాన్‌ మిస్సోరీ నిర్వహించిన స్టడీస్‌ ప్రకారం ఇనాక్టివేటెడ్‌ ఇన్‌ఫ్లూయెంజా టీకా 2019–20 మధ్య తీసుకున్న కొవిడ్‌ బారిన పిల్లలు కరోనా నుంచి త్వరగా కోలుకున్నారు.

టీకా ఎలా రక్షిస్తుంది?

కొవిడ్‌ టీకా, ఇన్‌ఫ్లూయెంజా టీకా ఎపిటామిమోలాజిక్‌ క్లినికల్‌ ఫీచర్లు ఇంచుమించు దగ్గరగా ఉంటాయి. అందుకే ఫ్లూ టీకాలు ఇప్పించడం వల్ల ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పిల్లలపై ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లూయెంజా ఇన్ఫెక్షన్‌ను రాకుండా ఇప్పిండే టీకా ద్వారా కొవిడ్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షక్‌ను తగ్గించవచ్చని, ఆరోగ్య సంరక్షణ కూడా భారం కాకుండా ఉంటుందని మహారాష్ట్ర పిడియాట్రిక్‌ టాస్క్‌ఫోర్స్‌ సూచించింది. ఇన్‌ఫ్లూయెంజా టీకా ద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అది కరోనా వైరస్‌తో పోరాడటానికి కీలకపాత్ర పోషిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఫ్లూ టీకా, కరోనా టీకా వేరువేరు. ఈ రెండు టీకాలకు మధ్య దాదాపు నాలుగు వారాల సమయం ఉండాలి. దీనివల్ల పిల్లల్లో యాంటీబాడీస్‌ వృద్ధికి తోడ్పాడే సమయం ఉంటుంది. వైరస్‌లతో పోరాడటానికి సరిపడే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version