కరోనా వాక్సిన్ విషయంలో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో కొన్ని ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భీమవరంలో పక్కదారిపట్టిన వ్యాక్సిన్ వయల్స్ ( వ్యాక్సిన్ బాటిల్స్) ఘటన సంచలనం అయింది.ఏయంసీ వ్యాక్సిన్ కేంద్రంలో వ్యాక్సిన్ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.చెత్తబుట్టలో వ్యాక్సిన్ వయల్స్ ను కనుగొన్న అధికారులు… పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక్కో వయల్ ను పది మందికి వేయాల్సి ఉండగా, 85 శాతం వయల్ ను సిబ్బంది వదిలేస్తున్నారు. మిగిలిన 15 శాతం వ్యాక్సిన్ ఉన్న వయల్స్ ను చెత్తకుప్పలో దాచి ఉంచారు కొందరు సిబ్బంది.చెత్తబుట్టలోని వ్యాక్సిన్ వయల్స్ ను గుర్తించి ఉన్నతాధికారులకు తహసీల్దార్ రమణారావు ఫిర్యాదు చేశారు. ఒక్కో వయల్ ను బ్లాక్ మార్కెట్ లో రూ.20 వేల రూపాయలకు సిబ్బంది విక్రయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.