వాక్సిన్ రిజిస్ట్రేషన్ కు చుక్కలే, సమస్యలే సమస్యలు…!

-

మే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్ళు పైబడిన వారికి వాక్సిన్ అందిస్తామని చెప్తుంది. ఈ క్రమంలో కోవిన్, ఆరోగ్య సేతు యాప్ లలో సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఫోన్ కి ఓటీపీ వచ్చినా సరే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ కావడం లేదు. సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తర్వాత ఆరోగ్య సేతు యాప్ హాంగ్ అవ్వడం మొదలుపెట్టింది. కోవిన్ సైట్ కూడా కుప్పకూలింది అని అంటున్నారు.

18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి రిజిస్ట్రేషన్ ప్రారంభించిన కొద్ది నిమిషాలకే సైట్ లు ఇబ్బంది పెట్టడంతో సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో సర్వర్లు డౌన్ అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై ఆరోగ్య సేతు నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. చిన్న లోపం ఉందని దాన్ని పరిష్కరించామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news