ఏపీలో ఆటో క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక ఫామ్ లలో వివరాలను నింపి ఈనెల 19 లోపు సచివాలయాల్లో అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ 1 నుంచి నగదు జమ అవుతుంది.

ఎంపికైన ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకురావడంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు భారీగా నష్టపోతున్నామని ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. దీంతో వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆటో, క్యాబ్ డ్రైవర్లు కొంత మేరకు అయినా లాభం పొందవచ్చని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.