హరిద్వార్ గంగాజలాల్లో వాజ్ పేయి అస్థికలు..

-

దత్తపుత్రిక నమిత చేతుల మీదుగా గంగాజలాల్లో

మాజీ ప్రధాని వాజ్ పేయి చితాభస్మాన్ని గంగాజలాల్లో కలుపుతున్న దత్త పుత్రిక నమిత

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి అస్థికలను హరిద్వార్లోని ప్రఖ్యాత హర్-కి-పౌరి ఘాట్ వద్ద గంగాజలాల్లో ఆదివారం నిమజ్జనం చేశారు. వాజ్ పేయి దత్తపుత్రిక నమిత చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. న్యూఢిల్లీలోని స్మృతి స్థల్ నుంచి చితాభస్మాన్ని నమిత, ఆమె కుమార్తె నీహారిక సేకరించారు. డెహ్రాడూన్ నుంచి ప్రారంభమైన ‘అస్థి కలశ యాత్ర’లో ఆమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. హర్-కి-పౌరి ఘాట్ కి చేరుకుని నమిత చేతుల మీదుగా గంగానదిలో చితాభస్మాన్ని కలిపారు. నమిత వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version