వాజ్ పేయి మా గ్రామానికి వచ్చారు. 1982లో మా ఊరు ( గౌరాయపల్లి , యాదగిరి గుట్ట మండలం) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వాజ్ పేయి గారు ప్రారంభించారంటే చాలామందికి ఆశ్చర్యం కలుగవచ్చు. కాని అది నిజం. అప్పట్లో వాజ్ పేయి గారు రావడంతో మా ఊరు బాగా పాపులర్ అయ్యింది కూడా. వాజ్ పేయి రావడానికి కారణం అప్పటి మా గ్రామ సర్పంచ్ జిన్న రాంరెడ్డి గారు. అయితే ఏర్పాట్లన్నీ ఘనంగా చేయించారు మా సర్పంచ్ గారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించే సమయంలో వాజ్‌పేయి మొహంలో ఏదో అసంతృప్తి కనిపించింది. ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు.. శిలా ఫలకం ఇంగ్లీషులోనే రాసిఉంది మరి ఏమై ఉంటుందా అని సర్పంచ్ గారు గాబరా పడుతున్నారు.
వాజ్‌పేయిగారు తన మనసులోని మాట కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తన అసంతృప్తికి కారణం ఆ శిలాఫలకం అని.. ఆ శిలాఫలకాన్ని చదివేది ఇక్కడి ప్రజలే కదా.. నేను కాదు కదా.. మరి అలాంటప్పుడు ఇంగ్లీషులో రాయడం బాగాలేదంటూ చెప్పారు. కాబట్టి తెలుగులో రాయించి ఉండాల్సిందన్నారు. అందుకే అటల్‌జీ మహోన్నత నేత అనిపించుకున్నారు. (సోషల్ మీడియా నుండి సేకరించింది…)
తెలుగులో రాయాల్సిందంటూ కోపడ్డ వాజ్‌పేయి..
-