చివరి వరకు కొడాలి నాని, నేను వైసీపీలోనే ఉంటామన్నారు వల్లభ నేని వంశీ. నిన్న జరిగిన సిఎం జగన్ సమీక్ష కు గైర్హజరుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో కోర్సు చేస్తున్న ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో హాజరుకాలేదు..నేను కొడాలి నాని పార్టీ మారుతున్నాం అంటూ ప్రచారాలు వచ్చాయి.. అవి మెరుపు కలలు మాత్రమే అటువంటి పరిస్థితి లేదని తెలిపారు.
ఎన్నికలు పరోక్ష, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి.. పరోక్ష ఎన్నికల్లో ఎప్పుడు వైసిపి పోటీ పడలేదు..అందుకనే టిడిపి కి మొన్న జరిగిన ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నారన్నారు. స్దానిక సంస్ధలకా కోటాలో జరిగిన ఎన్నికల్లో 19 ఓట్లు ఉన్నాయి.. అయినా టిడిపి గెలిచారు అంటే ఆర్దిక అంశాలు..ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టమని వెల్లడించారు. టిడిపి నాయకుల నుండి డబ్బులు ఖర్చు పెట్టించేందుకే ముందస్తు ఎన్నికలు అంటూ గ్లోబల్ ప్రచారాలు..మాతో వైసిపి నాయకులు టచ్ లో ఉన్నారంటూ గ్లోబల్ ప్రచారాలు చేస్తూ మైండ్ గేం మాత్రమే.. అంతిమంగా ఓట్లు వేలి గెలిపించేది ఓటర్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు వేయని వారు లోకేష్ సుందర మోకారవిందాని చూసి ఓట్లు వేస్తారా ? అని నిలదీశారు.