ఈనెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్

-

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత  వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టు ఈనెల 17 వరకు రిమాండ్ విధించింది. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో సీఐడీ అధికారులు కోర్టులో ఇవాళ పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో విజయవాడ సీఐడీ కోర్టు ఆయనను వర్చువల్ గా విచారించి రిమాండ్ విధించింది. ఈ కేసులో వంశీ ఏ71 గా ఉన్న విషయం తెలిసిందే.

సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ ఇప్పటికే విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవలే విజయవాడ జైలులో పలువురు వైసీపీ నేతలు వంశీని ములాఖత్ అయ్యారు. మాజీ సీఎం జగన్, పలువురు కీలక నేతలు భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version