వంశీ షాకింగ్ డెసిష‌న్‌… జ‌గ‌న్ ప్ర‌శంస‌

-

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వంశీ నిర్ణ‌యంపై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి సైతం ప్ర‌శంసించిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్ర‌మంలోనే వంశీ రెండోసారి జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ క‌ల‌యికే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

త్వ‌ర‌లో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతాయ‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేర‌తాని ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. జగన్ మాత్రం రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని ఎప్పుడో తేల్చి చెప్పారు. మ‌రి ఇప్పుడు వంశీ మ‌ళ్లీ జ‌గ‌న్‌ను ఎందుకు క‌లిశారో ? అర్థం కాని ప‌రిస్థితి.

వంశీ ఇప్ప‌టికిప్పుడు వైసీపీలో చేరినా.. చేర‌క‌పోయినా గ‌న్న‌వ‌రంలో మాత్రం వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుతో ఎలాంటి విబేధాలు లేకుండా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. యార్లగడ్డ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఎన్నికల్లో డబ్బులు పోగొట్టుకున్నారని వంశీ కాస్తా సింపతీ చూపిస్తున్నార‌ట‌.

అటు జ‌గ‌న్ కూడా యార్ల‌గ‌డ్డ రాజ‌కీయ భవిష్య‌త్తుపై హామీ ఇవ్వ‌డంతో వంశీ కూడా యార్ల‌గ‌డ్డ విష‌యంలో ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీ లేకుండా ముందుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు టాక్‌. ఇదే విష‌యాన్ని వంశీ మంగ‌ళ‌వారం జ‌గ‌న్‌ను క‌లిసిన‌ప్పుడు చెప్ప‌గా జ‌గ‌న్ సైతం వంశీ నిర్ణయాన్ని అభినందించారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version