పాల్వంచ ఘటనలో కీలక ముద్దాయి అయిన వనమా రాఘవకు బిగ్ షాక్ తగిలింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో… వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించింది ఖమ్మం జిల్లా కోర్టు. అంతేకాదు.. ఈ 14 రోజుల పాటు ఖమ్మం జైలుకు వనమా రాఘవను తరలించాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవాళ ఉదయం వనమా రాఘవను అరెస్ట్ చేసిన పాల్వంచ పోలీసులు… మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కోర్టు లో హాజరు పరిచారు. ఈ కేసులో పోలీసులు.. సమర్పించిన ఆధారాల మేరకు వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించింది ఖమ్మం జిల్లా కోర్టు. దీంతో పోలీసులు.. వనమా రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.
కాగా.. రామక్రిష్ణ సెల్ఫీ వీడియో ద్వారా వనమా రాఘవేంద్రపై ఆరోపణలు చేశారని… అయితే ఘటన జరిగిన 3 తేదీనే రామక్రిష్ణ బావమరిది జనార్థర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశామని ఏఎస్పీ వెల్లడించారు.