హైదరాబాద్లో ప్రగతినగర్ లేక్ వ్యూ కాలనీలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురి నిందితులను పోలీసులను అరెస్టు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రగతి నగర్లోని అంబీర్ చెరువు దగ్గర అక్టోబర్ 2న గాంధీ విగ్రహాన్ని హడావుడిగా కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించిన విషయం తెలిసిందే.నాటి నుంచి గాంధీ విగ్రహానికి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి.
దీంతో స్థానికులు మలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. గాంధీ విగ్రహం ముందే మందుబాబులు చిందులు వేసేవారు. విగ్రహానికి పెయింట్ పోయినా అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే మందుబాబులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించడంతో వారిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.