వర కట్నం విషయంలో సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంటి నిర్మాణం కోసం భార్య తల్లి దండ్రులను డబ్బులు అడిగినా.. వర కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఐపీసీ లోని సెక్షన్ 304 – బి ప్రకారం శిక్ష పడుతుందని తెలిపింది. అయితే ఇటీవల మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఒక మహిళ ఆత్మ హత్య చేసుకుంది.
దీంతో ఆ మహిళ భర్త, మామ లపై వర కట్నం వేధింపులు, వరకట్న మరణం తోపాటు ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ మహిళ భర్త, మామ కు కింది స్థాయి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే నిందితులు ఈ తీర్పు సవాల్ చేస్తు హై కోర్టు ను ఆశ్రయించారు. అయితే దీని పై మధ్య ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు శిక్ష ను రద్దు చేస్తూ.. ఇంటి నిర్మాణానికి మాత్రమే డబ్బులు అడిగారని తెలిపింది.
ఇది వరకట్నం కిందకు రాదు అని తెల్చింది. అయితే హై కోర్టు తీర్పు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. దీంతో ఈ కేసు పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్. వి. రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎ.ఎస్ బోపన్నలతో కూడా ధర్మాసనం విచారణ చేసింది. ఇంటి నిర్మాణానికి భార్య పుట్టింటి వాళ్లను డబ్బులు అడగినా.. వరకట్నం కిందకే వస్తుందని తెలిపింది. ఈ విషయంలో హై కోర్టు పొరపాటున వేరే తీర్పు ఇచ్చిందని తెలిపింది.