గ్లామర్ ట్రీట్ తో చెమటలు పట్టిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్..!

-

ప్రస్తుతం దేశ సినీ పరిశ్రమకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సినీ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన అందం, అభినయంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. క్రాక్ సినిమాలో జయమ్మ క్యారెక్టర్ లో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల యశోదలో మధుబాలగా.. వీరసింహారెడ్డిలో కూడా నటించి మరొకసారి తన నటన నిరూపించుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ.

ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వరలక్ష్మి ఒక వీడియోని పోస్ట్ చేయగా.. అందులో తెగ ఆనంద పడిపోతూ డాన్స్ చేయడం మనం చూడవచ్చు.. ఇంతకూ ఆ ఆనందం ఎందుకంటే ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య రెండు మిలియన్లకు పెరిగింది. అందువల్లే ఆమె ఇంత ఫుల్ ఖుషి అవుతోందని సమాచారం.. వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఎనీ ఎక్స్ క్లూస్ టు డాన్స్ అండ్ థిస్ రీజన్ ఇస్ అన్ ఆసం అంటూ రాసుకుంది. తనపై ప్రేమ చూపిస్తూ తనను ఫాలో అవుతున్న అభిమానులకు థాంక్స్ కూడా చెప్పింది.

ఈ వీడియోలో వరలక్ష్మి చాలా ఆనందంగా కనిపిస్తోంది. లైట్ గ్రీన్ కలర్ లో పొట్టిగా ఉన్న గౌన్ వేసుకున్న ఈమె వైట్ కలర్ షూ తో హెయిర్ లీవ్ చేసి ఆనందం పట్టలేక చిందులేస్తోంది. మరొకవైపు తన గ్లామర్ షో తో మరింత రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version