థియేటర్‌లో సినిమా కాన్సెప్ట్‌..ప్రేక్షకులు మర్చిపోతున్నారా…!

-

ఏదైనా ఒక సినిమా వస్తోందంటే… నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోందా? అమేజాన్‌లో రిలీజ్‌ అవుతుందా? లేదంటే హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోందా? అని అడిగుతున్నారేగానీ.. ఏ థియేటర్‌ అని అడగడం లేదు. దసరా అయినా.. దీపావళి అయినా.. క్రిస్మస్ అయినా.. కొత్త సినిమాలను ఓటీటీలో వెతుక్కోవాల్సిందే . దీపావళికి వరుస సినిమాలు రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి.

థియేటర్స్‌ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినా.. తెలుగులో ఇంతవరకు కొత్త సినిమా ఒక్కటీ థియేటర్‌లోకి అడుగుపెట్టలేదు. దీంతో చాలా సినిమాలు ఓటీటీని ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఓటీటీలే దిక్కు. కీర్తిసురేష్‌ బిజినెస్‌ఉమెన్‌ అవతారం ఎత్తిన మిస్‌ ఇండియా మూవీ 4న నెట్‌ ప్లిక్స్‌లో విడుదలవుతోంది. తమిళంలో సూర్య నటించిన ‘సూరారై పొట్రు ‘ తెలుగు అనువాదం ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో 12న అమేజాన్‌లో విడుదలవుతోంది. ఎయిర్‌ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవితచరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇందులో మోహన్‌బాబు ఇంపార్టెంట్‌ రోల్లో కనిపించనున్నాడు.

మనకు సంక్రాంతి ఎలా పెద్ద పండుగో.. తమిళ తంబీలకు దీపావళి బిగ్‌ ఫెస్టివల్‌. ఈ దీపావళికి థియేటర్స్ల్‌లోకి వచ్చే సినిమా ఒక్కటీ కనిపించకపోయినా.. ఓటీటీలో మాత్రం క్యూ కడుతున్నాయి. ఏ సినిమా చూడాలో తెలీని కన్‌ఫ్యూజన్‌లో తంబీలు వున్నారంటే కామెడీ కాదు. నయనతార దేవతగా నటించిన సినిమా ‘అమ్మోరు తల్లి’14న డిస్నీహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక హిందీలో ఈదీపావళికి రెండు క్రేజీ మూవీస్‌ వస్తున్నాయి. రాజ్‌ కుమార్‌ రావ్‌ నటించిన స్పోర్ట్స్‌ కామెడీ మూవీ ‘ఛాలంగ్‌’13న అమేజాన్‌లో విడుదలకానుంది. ఇందులో హీరో డ్రిల్‌ టీచర్‌గా కనిపించనున్నారు. రాజ్‌ కుమార్‌ రావు మరో మూవీ ‘లుడో’ 12న నెట్‌ప్లిక్స్‌లో వస్తోంది. అభిషేక్‌ బచ్చన్‌ మరో హీరోగా నటించిన మూవీకి అనురాగ్‌ బసు దరన్శకుడు.

కరోనా టైంలో చాలా సినిమాలు ఓటీటీలను ఆశ్రయించాయి. దీపావళి సీజన్‌లో నాలుగైదు చిన్న చిత్రాలు ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. పాయల్‌ రాజ్‌పూత్‌ నటించిన ‘అనగనగా ఓ అతిథి’. 13న ఆహాలో ఈ సినిమా విడుదలవుతోంది. అలాగే.. కృష్ణ అండ్‌ హిస్‌ లీలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ ‘ మా వింత గాధ వినుమా ‘ అంటూ 13న ఆహాలోకి వస్తున్నాడు. సైకో థ్రిల్లర్‌ ‘గతం’ 6న అమేజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఈసారికి దీపావళి సందడంతా ఓటీటీలదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version