ప్రస్తుతం తెలుగు సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా నడుస్తోంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమిళంలో కంటే తెలుగులో అవకాశాలు ఇస్తున్నారు. తాను వేసిన పాత్రలు తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నాన్న పేరు నిలబెట్టింది అని ఆమెను పొగుడుతున్నారు.ఇప్పుడు ఇంతగా ఫామ్ లో వున్న వరలక్ష్మీ ఒకప్పుడు కొందరు విమర్శించారట.
తక్కువ కాలంలోనే తన యాక్టింగ్, గొంతు పై సాధన చేస్తూ నటిగా తనను తాను నిరూపించకుంది. తన గొంతు తనని పెద్ద స్టార్ ని చేసాయని సంతోషించింది. నా వాయిస్ , యాక్టింగ్ నిజంగా ఇండస్ర్టీలో నటిగా పైకి రావడానికి ఎంతగానో సహకరించాయని..ఆ రెండు లేకపోతే నటిగా సక్సెస్ అయ్యేది కాదని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం వరలక్ష్మి ‘యశోద’..’హనుమాన్’…’వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది.