ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మధ్య టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలను పెంచాలని చిత్ర పరిశ్రమ పెద్దలు డిమాండ్ చేస్తూ ఉంటే.. తాము తగ్గేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పట్టుబడుతోంది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని నాని లాంటి హీరోలు… జగన్మోహన్ రెడ్డి సర్కారు పై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ ఈ వివాదం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం చిన్న పిల్లల లాగా వ్యవహరిస్తున్నాయి. గట్టిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ డిమాండ్ చేయటం లేదు. అందుకే ఇలాంటి సందిగ్దత నెలకొంది. ఏదైనా డిమాండ్ చేయాలంటే అందరూ ఏకమై గట్టిగా ప్రశ్నించాలి. నా సినిమాలు ఏపీ థియేటర్లలోనూ విడుదల చేస్తాను. నా సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డు చెప్పదు. అంతేకాదు ప్రభుత్వం తలచుకుంటే ఎవరి బెడ్ రూమ్ లో కైనా వెళ్లే అధికారం ఉంటుంది”అంటూ పేర్కొన్నారు వర్మ.