ఏదో విషయంపై సామాజిక మాధ్యమాల్లో నిలిచే సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి కొన్ని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇద్దరు ఒకరిపై మరొకరు ఈ మధ్య వ్యాఖ్యలు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రజాశాంతి పార్టీ చీఫ్, మత ప్రబోధకుడు కేఏ పాల్ ఓ కామెడీ పీస్‌లా తయారయ్యారు. ఏపీలో మొత్తం 175 స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని.. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనని చెబుతూ.. మీడియాలో పలు సార్లు పేర్కొన్నారు.
Jesus Christ told me @KAPaulOfficial will not get even one single single vote in election ..He also told me that even k a paul won’t vote for himself
— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2019
డొనాల్డ్ ట్రంప్, జార్జ్ బుష్‌తో పాటు ఎంతో మంది దేశాధ్యక్షులు తన వల్లే గెలిచారంటూ గొప్పలు చెప్పడం కేఏ పాల్ కి పరిపాటే. ఆయన వ్యవహార శైలిని గమనించిన మీడియా ఛానళ్లు సైతం మాటలు, చేతలను క్యాష్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. రాంగోపాల్ వర్మ 2017 ఫిబ్రవరిలో తాజ్ హోటల్‌లో తన కాళ్లు పట్టుకున్నారంటూ కేఏ పాల్ సంచలనానికి తెరతీశారు. దీనిపై స్పందించిన వర్మ … ‘నేను పాల్ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమే. కానీ మొక్కడానికి కాదు. ఆయన మెదడు దెబ్బతిన్నట్టు అనిపించింది. ఆయన కాళ్లు పట్టుకొని కిందకి లాగేస్తే.. కిందపడి తల సెట్ అవుతుందేమో అనే ఆశతో అలా చేశా.కానీ, జీసస్‌ని పంపి నన్ను ఏమైనా చేస్తాడనే భయంతో వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకున్నా’ అని సెటైర్ వేశారు. ‘త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కేఏ పాల్‌కు ఒక్క ఓటు కూడా రాదు. కేఏ పాల్ కూడా తన ఓటు తాను వేసుకోడట. ఈ విషయం నాకు జీసస్ క్రిస్ట్ చెప్పారు’ అని వర్మ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణను చూసి ఎంజాయ్ చేస్తున్నారు… దీనిపై పాల్ ఏవిధంగా స్పందిస్తారో చూద్దాం.