రాముడు కాదు రావణుడిని.. నెటిజన్ కు వర్మ వెరైటీ రిప్లై..

-

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. టాలీవుడ్‌ దర్శకులు రామ్ గోపాల్ వ‌ర్మ‌.ట్విట్ట‌ర్ లో వ‌ర్మ చేసే.. హంగామా అంతా ఇంతా ఉండ‌దు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెట్టి వివాదాల‌ను రేపుతారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ట్వీట్స్ కాస్త ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి.సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సినీ గేయ రచయిత “సిరా శ్రీ” ఓ ట్వీట్ చేశారు. ‘ఆర్జీవి ‘ సర్ నీ గురించి ఓ పద్యం రాస్తున్నాను, “సైకిల్ చైన్ తో సినిమా.. సైకీనే మార్చివేసి చరితాత్ముండై ..జై కొట్టిన చీ కొట్టిన.. రాకెట్టుగా దూసుకెళ్లు రాముండితడే” అని సిరాశ్రీ పేర్కొన్నారు. దీనిపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. బాగానే ఉంది కానీ నన్ను రాముడితో కంటే రావణుడితో పోలిస్తే నే నాకు మరింత సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు అర్జీవి శైలిలో నే ఆసక్తికర రిప్లై లు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version