ఇండియాలో శ్రీలంక లాంటి సంక్షోభం వస్తే ఎలా.. ? :కేంద్రంపై కవిత ఫైర్

-

దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమం తో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గానే తెలంగాణ లోని ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని ఎమ్మెల్సీ కవిత బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆహార భద్రత ముఖ్యమని, భవిష్యత్తులో ఏదైనా సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడితే ప్రపంచంలోని ఏ దేశమూ సాయం అందించలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్ సీఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఎఫ్ సీఐ వివిధ రాష్ట్రాల‌ నుండి ఒక పద్దతి ‌లేకుండా ధాన్యాలను కొంటోందన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి ఏడాది ఎఫ్ సీఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతి రాష్ట్రం ఏ పంట పండించాలి అనే విషయంపై అక్కడి రైతులకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ట్రం, ‌కులం, మతంతో సంబంధం ‌లేకుండా, ఎక్కడ ఉన్నా రైతు రైతేనన్న ఎమ్మెల్సీ కవిత, కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version