స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన సినిమా . ఈ సినిమాను ముందు జనవరి 12 విడుదల కు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ను 14 తేది కి వాయిదా పడింది. విడుదల తర్వాత తెలుగు లో మాత్రం బాలయ్య బాబు వీర సింహ రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ల మధ్యలో పడి నలిగిపోయింది.
తెలుగు లో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేదు. తమిళంలో మాత్రం విజయ్ అదరకొట్టాడు. 250 కోట్ల రూపాయల దాకా వసూళ్ళు సాధించి అక్కడ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. తెలుగు సినిమా ప్రమోషన్ కోసం రాని విజయ్ మాత్రం విడుదల తర్వాత దిల్ రాజు ఇంటికి వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం కొత్త సినిమాల రాకతో కొద్ది థియేటర్స్ లో మాత్రమే రన్ అవుతోంది.
ఇక ఈ చిత్రం ఓటిటి రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వారు భారీ ధరకు కొన్నారు. వాస్తవానికి విడుదలైన నెల రోజుల లోపే అంటే ఫిబ్రవరి 10న వస్తుందని అనుకున్నారు. వినిపిస్తున్నసమాచారం ప్రకారం వారసుడు ఫిబ్రవరి 22న అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ సినిమా అయినందున వారసుడు చిత్రాన్ని నెల రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు.