వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఎంపీ

-

కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘాలు నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాకేష్ టికాయత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రైతులంతా సిద్ధం అవుతున్నారు. ఈ నెల 25వ తేదీన భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఐతే ప్రస్తుతం రైతులు చేస్తున్న నిరసనపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మాట్లాడారు. కిసాన్ పంచాయితీలను సమర్థించిన వరుణ్ గాంధీ, రైతులతో సంప్రదింపులను కేంద్రం జరపాలని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

రైతుల బాధలను కేంద్రం అర్థం చేసుకోవాలనీ, రైతులు మన సొంత మనుషులనీ, గౌరవప్రదంగా వారితో సంప్రదింపులు జరపాల్సిన అవసరం చాలా ఉందని, సాగు చట్టాలపై వారు వినిపిస్తున్న గొంతును ఒక్కసారి కేంద్రం వినాలని వరుణ్ గాంధీ అన్నారు. నిరవధిక నిరసన చేపడుతున్న రైతులకు, ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వరుణ్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version