తన నెక్స్ట్ మూవీని వేరే లెవల్లో ప్రమోట్ చేస్తున్న వరుణ్ తేజ్…..

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీ మీద చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

ఇక ఫస్ట్ సింగిల్ వందేమాతరం అనే సాంగ్ ని వాఘా – అటారి బోర్డర్లో విడుదల చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు వరుణ్ తేజ్. ఇక ఆ తరువాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న రియల్ లైఫ్ వింగ్ కమాండర్ తో ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి దాన్ని మీడియాకి విడుదల చేశారు.ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version