పీచు మిఠాయిపై నిషేధం విధించిన త‌మిళ‌నాడు

-

పీచు మిఠాయి అంటే పిల్ల‌లు ఎగిరి గంతులేస్తారు. ఈ మిఠాయిని తినేందుకు పెద్ద‌లు కూడా ఆస‌క్తి చూపుతారు. అలా నోట్లో వేసుకోగానే క‌రిగిపోతోంది పీచు మిఠాయి. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఇష్టంగా తినే ఈ పీచు మిఠాయిపై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్ర వ్యాప్తంగా పీచు మిఠాయి విక్ర‌యాల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు హెల్త్ మినిస్టర్ సుబ్ర‌మ‌ణియ‌న్ వెల్ల‌డించారు.

పీచు మిఠాయి లో స్వచ్ఛతను కోల్పోకుండా, రంగురంగుల్లో ఉండేందుకు కొత్త రసాయనాలను వాడుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా తేలడంతో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. పీచు మిఠాయి త‌యారీ, విక్ర‌యాలు చేప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సుబ్ర‌మ‌ణియ‌న్ ఆదేశించారు.గత వారమే పుదుచ్చేరి ప్రభుత్వం ఈ మిఠాయిని బ్యాన్ చేయగా.. పక్క రాష్ట్రాల్లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version