వాస్తు: ఇంట్లోవాళ్ల ఆరోగ్యం బాగుండాలంటే వీటిని మరచిపోకండి..!

-

వాస్తు ని అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ఫాలో అయితే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈ మధ్య ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ని అనుసరించి ఏ సమస్య అయినా తొలగించుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ఎనర్జీ ఎటువైపు అయితే ఫ్లో అవుతుందో ఆ పక్క పనులు చేసుకుంటే మంచిది.

 

ముఖద్వారం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉంటే మంచిది ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అలానే మీరు ధనాన్ని పెట్టేటప్పుడు దక్షిణ దిశ లో పెడితే మంచిది ఇలా దక్షిణ దిశ లో ఉంచి ఉత్తరం వైపు తెరిస్తే మంచి ఎనర్జీ వస్తుంది. పైగా ధనం కూడా పెరుగుతుంది. అలానే ఇంట్లో చేపలు ఉండడం కూడా చాలా మంచిది. ఇంట్లో చేపలు ఉంటే ఇల్లు ప్యూరిఫై అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఇంట్లో చేపల్ని పెంచే వాళ్ళు ఎప్పుడూ వాటిని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.

ఎక్వేరియం ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఇంట్లో ఫ్లూట్ ని ఉంచడం మంచిది ఇంట్లో రెండు ఫ్లూట్స్ ని వేలాడ తీయడం వలన మంచి బెనిఫిట్ కలుగుతుంది ఈ విధంగా మీరు వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి కలుగుతుంది ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version