వాస్తు: వంటగదిలో గృహిణి ఎలా ఉండాలి.. ఫ్రిడ్డ్ ఇతర సామాన్లను ఏ దిశలో ఉంచాలో తెలుసా..!

-

ఇంటి నిర్మాణంలో వంటిగదికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. పండితులైనా, ఇంజనీర్లైనా ఇదే చేస్తుంటారు. వంటగది ఎల్లప్పూడూ ఆగ్నేయ దిశలో ఉంచాలని చెబుతుంటారు. అయితే వంటగదిలో గృహిణి ఎలా ఉండాలి, ఫ్రిడ్ట్, ఇతర సామాన్లను ఏ దిశలో ఉంచాలో మీకు తెలుసా..ఎక్కడ కాళీగా ఉంటే అక్కడ మా ఇష్టం వచ్చినట్లు పెడతాం అనుకుంటున్నారా..కానీ ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. వాస్తుకి సైన్స్ కి సంబంధం ఉంటుంది. వాస్తు మీద నమ్మకం లేకకపోయినా సైన్స్ ప్రకారం అయినా మనం కొన్నింటిని నమ్మాల్సి ఉంటుంది.

వంటగది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని లేదంటే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటారు. మహిళలు ఎక్కువ సమయం పాటు కిచెన్ లోనే గడపాల్సి వస్తుంది కనుక కిచెన్ లో ఈ చిట్కాలను పాటించడం వల్ల మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.

ముఖ్యంగా స్టవ్ ను వంటగదిలో ఎల్లప్పుడూ తూర్పు దిశకు నిలబడే విధంగా ఉంచాలి. అదేవిధంగా స్టవ్ కి దగ్గరగానే సింకు ఉండకూడదు. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపు ఉండాలి. ముఖ్యంగా వంటగదిలో సింక్ ఉన్నవారు మనం తిన్న ప్లేట్లను సింక్ లో పడేస్తాము. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో అధిక మొత్తంలో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట. సింక్ ఉన్నదే ప్లేట్స్ వేయటానికి అనకుంటున్నారా..వేయండి.కానీ వెంటనే ప్లేట్లను శుభ్రం చేయాలి. లేదంటే బయట వేయాలని పండితులు చెబుతున్నారు.

ఇక చాలాసార్లు మన ఇంటిలో నల్లా నుంచి వాటర్ లీక్ అవుతుంటుంది. ఇలా వాటర్ లీకేజ్ అవ్వటం వల్ల కూడా సంపద వెళ్ళిపోతుందట. అందుకోసమే వెంటనే అలాంటి వాటికి మరమ్మత్తు చేయించాలి. మహిళలు ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల ఆ ఇంట్లో మంచిజరుగుతుందని వాస్తు నిపుణలుు చెబుతున్నారు.

వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని మన అందరికి తెలిసిన విషయమే.. ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే మనకు ముందు గుర్తొస్తాయి. కాబట్టి గృహం నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఇంటిని నిర్మించే ముందు ముఖ ద్వారానికి ఎదురుగా ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవాలట. మీ వంటగది..అందులో సామాన్లు ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version