మే 26 గురువారం రాశి ఫలాలు..

-

మే 26 గురువారం రాశి ఫలాలు..ఈరోజు ఏ రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మేషం: అనుకోని లాభాలు గడిస్తారు. అప్పులు తీరుస్తారు. ధనలాభాలు. ఇంట్లో శుభ కార్యం చేయాలని భావిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈరోజు పూర్తీ అవుతాయి.. ప్రయాణాలు చేస్తారు.. దైవదర్శనాలు చేస్తారు.

వృషభం:మీరు చేసే పనులలో జాప్యం పెరుగుతుంది కానీ ధైర్యంతో దాన్ని అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషం. ఆర్థిక మందగమనం. అప్పుల కోసం ప్రయత్నం. వివాహాది శుభకార్యల కోసం ప్రయత్నం. మహిళల ద్వారా లాభాలు.ఈరోజు మంచి రోజు..కొత్త పనులు ప్రారంభించాలని అనుకొనేవాళ్ళకు మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధునం : మీతో ఉన్నవారు మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మకూడని రోజు. పెద్దలు, అన్నదమ్ముల నుంచి సహాయం అందుంతుంది. మహిళలకు శుభవార్తలు. అర్థికంగా ఈరోజు బాగుంటుంది.దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు..కొత్త రుణాలు లాభిస్తాయి..

కర్కాటకం: అనుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి.పాత బకాయిలు వసూలు అవుతాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు..నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు..ఇష్ట దైవాన్ని స్మరించుకోవటం ఉత్తమం..

సింహం : ఈరోజు మంచి వార్తలు వింటారు. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. శుభకార్యములకు హాజరవుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవం పెరుగుతూంది. ఈరోజు చాలా మంచిరొజు..

కన్య : చేసే అన్ని పనులలో జాప్యం పెరుగుతుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం రాదు. అప్పుల కోసం బ్యాంకులలో ప్రయత్నిస్తారు. రియల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలం కాదు..గణపతిని పూజించడం మంచిది.

తులా: నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ముఖ్యమైన పనులలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారముల పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం: దూరప్రయాణ చేసే అవకాశాలు ఉన్నాయి.. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.ఆరోగ్యం పై శ్రద్ద వహించాలి..

ధనస్సు: పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు..అనారొగ్య సమస్యలు, దైవదర్శనాలు.

మకరం: ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.శుభకార్యాలు చేపడతారు.

కుంభం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు దైవ చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.ఈరోజు అంత మంచి రోజు కాదు.

మీనం: ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి గృహంలో శుభకార్య పరమైన ఖర్చులు పెరుగుతాయి సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాలు అందుకుంటారు..కొత్త కార్యాలకు శ్రీకారం చుడతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version