వాస్తు: ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు ఉండవట..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ ఉంటారు. దీని వల్ల మంచి కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు కూడా పాజిటివ్ ఎనెర్జీని కలిగి నెగిటివ్ ఎనెర్జీని దూరం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. దాంతో మంచే కలుగుతుంది ఇబ్బందులు అన్ని తొలగి పోతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం కుళాయిల నుండి కాని ట్యాంకులు నుండి నీళ్లు కారితే మంచిది కాదు. ఇలా ఎక్కువగా కారి పోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు అంటున్నారు. కాబట్టి అలా ఎప్పుడు జరగకుండా చూసుకోండి. కుళాయిలను, ట్యాంకులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి.

ఒకవేళ కనుక ఏదైనా కుళాయి పాడై పోతే వాటిని వెంటనే రిపేర్ చేయించుకోండి. అలానే ఇంట్లో పాలు కారే మొక్కలు ఉండకూడదు దీని వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలానే పూజ చేసేటప్పుడు కూడా నియమాలను పాటించాలి. ఎప్పుడైనా సరే కబోర్డ్ తలుపులు తెరిచేటప్పుడు అవి ఉత్తరం వైపు ఉండాలి. దాని వల్ల ధనం పెరుగుతుంది. ఇలా కనుక ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version