వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకో వచ్చు. చాలా మంది వాస్తు ని ఫాలో అవుతూ వుంటారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు మొదలు అన్ని సమస్యలని కూడా వాస్తు తో తొలగించుకోవచ్చు. ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది వున్నా లేదంటే వాస్తు దోషాలు వంటివి ఏమైనా వున్నా సరే తొలగిపోతాయి. ఈరోజు పండితులు మనతో ఆర్థిక సమస్యలు గురించి చెప్పారు. ఆర్ధిక సమస్యలు లేకుండా హాయిగా ఉండాలంటే వీటిని తప్పక ఆచరించాల్సిందే.
ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే కుబేరుడి యంత్రాన్ని ఉంచుకోవాలి. ఇది నెగటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది. కాబట్టి కుబేరుని యంత్రాన్ని ఉంచుకోండి.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెత్తాచెదారని తొలగించాలి లేకపోతే అనవసరంగా ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం బాగుండాలి ఇంటి ముఖద్వారాన్ని బట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇంటి ఆవరణని అందంగా ఉంచుకోవడం ముఖ్యం. పచ్చని మొక్కలు వంటివి ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.
అలానే ఎక్కడా కూడా నీళ్లు కారిపోతూ ఉండకూడదు. నీళ్లు కారిపోకుండా చూసుకోవాలి లేదంటే ఆర్ధిక నష్టం కలుగుతుంది.
పనికిరాని సామాన్లు ని చాలామంది వాటర్ ట్యాంక్ మీద పెడుతుంటారు ఇది కూడా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి ఆ తప్పును కూడా చేయొద్దు.
వంటగదిలో సామాన్లు ఆర్డర్ లేకుండా ఉన్నట్టయితే సర్దుకుంటూ ఉండాలి. వాటిని మంచిగా సర్దుకోండి. లేకపోతే ఇది కూడా చెడు ప్రభావాన్ని కలిగించవచ్చు. ఈశాన్యం వైపు ఆరెంజ్, ఎరుపు, పింక్ రంగులు ఉంటే మంచిది ఇలా అనుసరించడం వలన ఆర్ధిక బాధలు ఉండవు అలానే నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు.