ఇక కేబుల్ బ్రిడ్జ్ మీద బండి ఆపితే సీజ్ !

-

ప్రజల సౌకర్యార్థం తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి ఇప్పుడు జనాల ప్రాణాలమీదకి తెస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం అక్కడికి చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. వేగంగా వస్తున్న వాహనాలను సైతం గుర్తించకుండా.. రోడ్డుపైనే ఆటలాడుతున్నారు. దీంతో కేబుల్ బ్రిడ్జి పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు విధించారు.

ఆ ఆంక్షల ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల నుండి సోమవారం 6 గంటల వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు, అలానే ప్రతి రోజు రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేయనున్నారు. ఇక వాహనాలు తిరిగే సమయంలో బ్రిడ్జిపై అటు ఇటు క్రాస్ చేయవద్దని, బ్రిడ్జ్ రైలింగ్ పై నిలబడవద్దని పోలీసులు కోరుతున్నారు. కేబుల్ బ్రిడ్జి పై వాహనాలను పార్క్ చేయడానికి వీల్లేదని, బ్రిడ్జి పై వాహనం పార్క్ చేస్తే సీజ్ చేస్తామని చెబుతున్నారు. కేబుల్ బ్రిడ్జి పై బర్త్ డే సెలబ్రేషన్స్ నిషేధమని, బ్రిడ్జిపై కూర్చుని మద్యం సేవిస్తే కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. కేబుల్ బ్రిడ్జి పై స్పీడ్ లిమిట్ 35 విధించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై భారీ వాహనాలకు అనుమతి ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version