దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 19ఏళ్ళ బాలికపై జరిగిన అత్యాచారం దేశ ప్రజలని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ముందుగా ఇండియా గేట్ వద్ద నిరసన చేపడతామని అనుకున్నప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిరసనలో సీపీఐ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరీ, సీపీఐ నాయకులు డి రాజా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా నిరసనల్లో పాల్గొంటాడట. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దిగిపోవాలంటూ యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా చేసేదాక నిరసన కొనసాగుతుందటూ చెబుతున్నారు.