వాహనాలు 15 ఏళ్లు దాటినా వాడుకోవచ్చు.. కండిషన్స్ అప్లై!

-

కేంద్రం ఇటీవల తెచ్చిన స్క్రాప్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కసరత్తు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.

తెలంగాణలో 15 ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, అందుకు వాహనదారులు వాలంటరీగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అందుకోసం వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయని భావిస్తే నడుపుకోవచ్చన్నారు. అయితే, తదుపరి ఐదేళ్ల కోసం రూ.5వేలు, మరో పదేళ్ల కోసం రూ.10వేల గ్రీన్ టాక్స్ చెల్లించాలని తెలిపారు. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా? వద్దా అనేది యాజమాని ఇష్టానికే వదిలేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ మార్చాలనుకుంటే తర్వాత వాహనానికి రాయితీని కల్పిస్తామన్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version