ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించే జూరాల ప్రాజెక్టు మీద నుంచి రాకపోకలు నిషేధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు ఏఈ వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు క్రస్టర్ గేట్స్ కు సౌండ్ బ్లాస్టింగ్ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజుల పాటు రాకపోకలను నిలిపి వేస్తామని ఆయన ప్రకటనలో వివరించారు.
ఈ ప్రకటన ను దృష్టిలో ఉంచుకొని వాహన దారులు తమకు సహకరించాలని ఆయన కోరారు. ప్రతిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని మండలాల ప్రజలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, మక్తల్, దేవరకద్ర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రాకపోకలు సాగేవి. ఈ ప్రాంతాల నుంచి రాయలసీమ కు వెళ్లే వాహనాలు సైతం కొన్ని ఇటువైపుగా సాగించేవి. అయితే.. జూరాల ప్రాజెక్టు మీద నుంచి రాకపోకలు నిషేధిండంతో.. వారు వేరే మార్గాల గుండా వెళుతున్నారు.